విశ్వక్ సేన్ పాగల్ అవుతున్నాడు..!

యువ హీరో విశ్వక్ సేన్ మరో కొత్త మూవీ స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా హిట్ తో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ కొత్త సినిమా ఈరోజు ముహూర్తం పెట్టుకున్నాడు. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను నరేష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి టైటిల్ గా పాగల్ అని ఫిక్స్ చేశారు. విశ్వక్ సేన్ కు ఈ టైటిల్ పెర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. 

పాగల్ అంటే తెలుగులో పిచ్చోడు.. టైటిల్ లో లవ్ సింబల్ ఉంది. అంటే విశ్వక్ సేన్ ఒక విరహ ప్రేమకథతో ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈనగరానికి ఏమైంది, ఫలానుమదాస్ సినిమా తర్వాత నాని ప్రొడ్యూసర్ గా చేసిన హిట్ అతనికి మంచి మైలేజ్ ఇచ్చింది. హిట్ ఎండింగ్ లో ఆ సినిమా సీక్వల్ కూడా ఉందని చెప్పారు. మొత్తానికి కుర్ర హీరో  వరుస అవకాశాలతో అదరగొడుతున్నాడు.