అఖిల్ తో నితిన్

అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ సినిమా నిర్మించాడు నితిన్. అక్కినేని వారసుడిని పరిచయం చేసిన నితిన్ ఆ సినిమాకు 50 కోట్లు బడ్జెట్ తో తీశాడు. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా అఖిల్ కు నిరాశ మిగిల్చింది. ఆ తర్వాత కూడా తీసిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అఖిల్ మళ్ళీ నితిన్ నిర్మాణం లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. 

అఖిల్ తో ఒకసారి వర్క్ అవుట్ కాకున్నా మళ్ళీ రెండో ప్రయత్నం చేసేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. భీష్మ హిట్ తో జోష్ లో ఉన్న నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. హీరోగానే కాదు నిర్మాతగా కూడా బిజీ అయ్యే ప్లాన్ లో ఉన్న నితిన్ అఖిల్ తో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.