1.jpeg)
రూలర్ తర్వాత బాలయ్య బాబు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. సింహా, లెజెండ్ తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలో అన్న కన్ ఫ్యూజన్ ఏర్పడింది.
అంజలి, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్స్ పేర్లు వినపడగా ఫైనల్ గా బాలయ్య సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా ఆరెక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ను ఓకే చేశారట. బాలయ్య చేసిన ఎన్టీఆర్ బయోపిక్ లో జయప్రద పాత్రలో కనిపించింది పాయల్. ఇక సీనియర్ హీరో వెంకటేష్ తో వెంకీ మామ సినిమాలో కూడా నటించిన పాయల్ లేటెస్ట్ గా బాలకృష్ణ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
పాయల్ హీరోయిన్ ఓకే చేయడంతో ఈ సినిమా గ్లామర్ విషయంలో కూడా క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. తను హీరోయిన్ గా చేసే సినిమాలకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ పాపులర్ అవుతుంది పాయల్ రాజ్ పుత్. మరి బాలకృష్ణ సరసన ఈ అమ్మడు ఎలా ఉంటుందో చూడాలి.