భూమిక నెగటివ్ షేడ్.. చూడగలమా..?

ఖుషి, ఒక్కడు సినిమాల్లో నటించిన హీరోయిన్ భూమికని అప్పటి యూత్ ఆడియెన్స్ చాలా ఇష్టపడ్డారు. మహేష్ పక్కనే కాదు పవన్ సరసన కూడా పర్ఫెక్ట్ అనిపించుకున్న భూమిక కొన్నాళ్ళు కెరియర్ కు బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది. ఒకప్పుడు హీరోయిన్ ఇప్పుడు కేవలం సైడ్ రోల్స్ తో సరిపెట్టుకుంటున్నఈ అమ్మడు కొత్తగా తనలోని నెగటివ్ షేడ్ చూపిస్తా అని అంటుంది. 

ఒకప్పుడు హీరోయిన్ గా తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న భూమిక ఇప్పుడు నెగటివ్ రోల్ చేస్తే ఆడియెన్స్ రిసీవ్ చేసుకోవడం కష్టమే. ఈమధ్య సవ్యసాచి, రూలర్ సినిమాల్లో అలా చిన్న పాత్రల్లో నటించిన భూమిక ఈసారి లేడీ విలన్ గా అదరగొట్టేందుకు రెడీ అయ్యిందట. మిస్సమ్మ సినిమాలో ఏదో కొద్దిగా విలన్ షేడ్ ఉన్నట్టుగా కాకుండా రాబోయే సినిమాలో పూర్తిస్థాయి లేడీ విలన్ గా నటిస్తుందట భూమిక. మరి భూమిక చేస్తున్న ఈ క్రేజీ అటెంప్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇంతకీ భూమిక విలన్ గా చేస్తున్న సినిమా ఎవరిదీ.. ఆ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు.