నాని 'వి' ఒక పార్ట్ కాదా..!

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ V. ఆల్రెడీ నాని ఈ డైరక్టర్ తో రెండు సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్నా హ్యాట్రిక్ మూవీ ఇది. V లో నాని నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. ఇక సుధీర్ బాబు కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్స్ గా అదితి రావు హైదరి, నివేదా థామస్ నటిస్తున్నారు. 

అసలైతే కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఉగాది కానుకగా ఈ నెల 25న వి రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల థియేటర్స్ బంద్ చేశారు. అందుకే సినిమాను ఏప్రిల్ కు వాయిదా వేశారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఒక స్పెషల్ న్యూస్ బయటకు వచ్చింది. V ఒక పార్ట్ తో ముగిసే సినిమా కాదట. V క్లైమాక్స్ లో ఈ ట్విస్ట్ ఇస్తాడట దర్శకుడు మోహనకృష్ణ. V కు సీక్వల్ కూడా ఉంటుందట. అందుకే V పార్ట్ 1ని ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ దగ్గర ఆపేస్తారట. ఆడియెన్స్ అందరు V-2 గురించి ఎదురుచూసేలా చేస్తారట. మొత్తానికి నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి ఇద్దరు కలిసి చిన్న సినిమాల్లో బాహుబలిగా Vని చేద్దామని అనుకున్నారు కావచ్చు. మరి వీరి ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి.