స్వీటీ అనుష్క సీక్రెట్ రిలేషన్ ఎవరితో..?

స్వీటీ అనుష్క నటించిన నిశ్శబ్దం ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్కతో పాటుగా మాధవన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లో కోనా వెంకట్ ఈ సినిమా నిర్మించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క తన సీక్రెట్ రిలేషన్ గురించి బయట పెట్టింది. 2008లో తనకు ఒక వ్యక్తితో స్వీట్ రిలేషన్ ఉందని చెప్పింది అనుష్క ఆ వ్యక్తి ఎవరన్నది మీరు గెస్ చేయలేరని.. అతను ఎవరన్నది నా మ్యారేజ్ తర్వాత మీకే తెలుస్తుందని అన్నది అనుష్క. 

అనుష్క మ్యారేజ్ టైం కు తన సీక్రెట్ రిలేషన్ గురించి బయటకు తెలుస్తుంది అని చెప్పిందంటే ఇప్పటికి అతనితో రిలేషన్ లో ఉన్నట్టే అని కొందరు అంటున్నారు. ఏది ఏఁయినా అనుష్క చెప్పిన ఆ స్వీట్ పర్సన్ ఎవరై ఉంటారా అని వెతకడం మొదలు పెట్టారు. భాగమతి తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన అనుష్క నిశ్శబ్దం తర్వాత మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తుందని చెబుతుంది.