ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతికి కష్టమేనా..?

ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ మొదలైన దగ్గర నుండి ఏదో ఒకవిధంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. చరణ్, ఎన్టీఆర్ లకు గాయాల వల్ల కొన్నిరోజులు షూటింగ్ క్యాన్సిల్ కాగా రాజమౌళి కొడుకు పెళ్ళికి కొద్దిరోజులు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు. ఈ షూటింగ్ లేట్ వల్ల రిలీజ్ డేట్ లో మార్పు వచ్చింది. 2020 సమ్మర్ అనుకున్న ఈ సినిమా రిలీజ్ కాస్త 2021 సంక్రాంతికి చేరింది. ఇక ఇప్పుడు కరోనా వల్ల అది కూడా వాయిదా పడేలా ఉంది.

2021 జనవరి 8న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అని చెప్పినా కరోనా వల్ల షూటింగులు అన్ని బంద్ చేశారు. కరోనా తీవ్రత తగ్గినా తర్వాతే మళ్ళీ షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. చూస్తుంటే ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతి నుండి సమ్మర్ కు వాయిదా పడినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అలియా భాయ్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.