
సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత పరశురామ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఉగాది రోజు వస్తుందట. ఈ సినిమా తర్వాత మహేష్ వెంకీ కుడుముల డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఛలో, భీష్మ రెండు వరుస సినిమాలు హిట్ అందుకున్న వెంకీ కుడుములని పిలిచి తన కోసం కథ సిద్ధం చేయమని చెప్పాడట మహేష్.
హిట్టు కొట్టే దర్శకులకే మహేష్ ఛాన్స్ ఇస్తాడని పూరి అన్న కామెంట్ ను నిజం చేస్తూ మహేష్ వెంకీని పిలిచి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే తనతో కోట్లు బడ్జెట్ పెట్టి సినిమాలు చేసే నిర్మాతల శ్రేయస్సు కోసమే మహేష్ కూడా ఆలోచించి సినిమాలు చేస్తున్నాడని తెలుస్తుంది. రెండు సినిమాలతోనే వెంకీ తన మార్క్ చూపించాడు. మరి మహేష్ తో సినిమా చేస్తే అదెలా ఉంటుందో చూడాలి.