
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచాడు. 2019లో విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయినా సరే అతనే టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అర్జున్ రెడ్డితో యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఆడియెన్స్ లో మాత్రం క్రేజ్ తెచ్చుకున్నాడు.
విజయ్ రీసెంట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరక్షన్ లో విజయ్ సినిమా చేస్తున్నాడు. ఫైటర్ టైటిల్ తో వస్తున్నా ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫ్లాపులు వస్తున్నా విజయ్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గట్లేదు.