
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా కొరటాల శివ డైరక్షన్ లో చిరు సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్లిద్దరు కలిసి వినయ విధేయ రామ సినిమా చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా ఇద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. చిరు ఆచార్య సినిమాలో చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుండగా ఆ రోల్ చాలా క్రేజీగా ఉండనుందని తెలుస్తుంది.
బాలీవుడ్ లో ఒక రేంజ్ లో ఫామ్ లో ఉన్న కియరా అద్వానీ తెలుగులో రెండు సినిమాలు చేసింది. అయితే ఆ తర్వాత కూడా అవకాశాలు వస్తున్నా సరే అక్కడ బిజీ అవడంతో ఇక్కడ సినిమాలకు నో చెబుతూ వచ్చింది. చరణ్ సినిమా ఛాన్స్ కాబట్టి కియరా ఛాన్స్ వదులుకోకూడదని ఒకే చెప్పిందట. సో మరోసారి చరణ్, కియరా జోడీ ప్రేక్షకులను అలరించనుంది. అసలైతే ఈ మూవీలో మహేష్ నటించాల్సి ఉండగా మధ్యలో ఏమైందో ఏమో కానీ సడెన్ గా మహేష్ ప్లేస్ లో చరణ్ వచ్చాడు. ఈ సినిమాకు చరణ్ ఒక నిర్మాత అవడం వల్ల బడ్జెట్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది.