అనుష్కతో ప్రభాస్ బ్యానర్..!

త్వరలో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుష్క తన తర్వాత సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తుందని తెలుస్తుంది. ప్రభాస్ తో సినిమాలు నిర్మించే యువి క్రియేషన్స్ అనుష్క సినిమాను నిర్మించాలని చూస్తున్నారు. రారా క్రిష్ణయ్య డైరక్టర్ మహేష్ తో అనుష్క సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ డైరక్షన్ లో అనుష్క ఒక సినిమా చేస్తుందని అంటున్నారు. 

ఈ సినిమా కూడా హర్రర్ థ్రిల్లర్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది. కథ, కథనాలు అనుష్కని చాలా ఎక్సయిట్ అయ్యేలా చేశాయట. యువి క్రియేషన్స్ వారు గౌతమ్ మీనన్, మహేష్ రెండు సినిమాల్లో ఒకటి నిర్మిస్తారని తెలుస్తుంది. యువి క్రియేషన్స్ సినిమా అంటే కచ్చితంగా కథలో మ్యాటర్ ఉన్నట్టే లెక్క. ప్రస్తుతం ఈ బ్యానర్ లో ప్రభాస్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా తెరకెక్కుతుంది.