మహేష్ తో నేను రెడీ..!

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా అంటే ఎవరు కాదనకుండా ఉంటారు చెప్పండి. కొంతమంది దర్శకులు అయితే మహేష్ ఎప్పుడు ఛాన్స్ ఇస్తారా అని ఎదురుచూస్తుంటారు. అది మహేష్ తో మొదటి సినిమా అవకాశం కోసమైనా సరే ఆల్రెడీ అతనితో పనిచేసిన దర్శకుడు అయినా సరే మహేష్ తో సినిమా అంటే సై అనేస్తారు. ఇక ఇప్పటికే మహేష్ ను డైరెక్ట్ చేసే దర్శకుల లిస్ట్ పెద్దగా ఉండగా.. మహేష్ తో నేను సినిమాకు రెడీ అంటూ ఆ లిస్ట్ లో చేరాడు పూరి జగన్నాథ్. 

మహేష్ తో పోకిరి ఇండస్ట్రీ హిట్, బిజినెస్ మెన్ హిట్ అందించిన పూరి మహేష్ తో సినిమా కోసం కొన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. జనగణమన అంటూ ఒక సబ్జెక్ట్ మహేష్ కోసం సిద్ధం చేసుకుని కొన్నాళ్ల నుండి ఎదురుచూస్తున్న పూరి మహేష్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి అప్పట్లో కాస్త నిరాశ చెంది మహేష్ కేవలం హిట్టు కొట్టిన దర్శకులకే ఛాన్సులు ఇస్తాడని అన్నాడు.  

ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత మహేష్ కోసం ఒక కథ సిద్ధం చేశాడట పూరి. మహేష్ ఛాన్స్ ఇస్తే అతనితో సినిమా చేసేందుకు సిద్ధమని అంటున్నాడు మరి మహేష్ పూరికి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే బాగుటుంది అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.