సమంత మోస్ట్ డిజైరబుల్ ఉమెన్

పెళ్లి తర్వాత కూడా సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న సమంత 2019 టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా టాప్ 1 లో నిలిచింది. లాస్ట్ ఇయర్ 3వ స్థానంలో ఉన్న సమంత ఈ ఇయర్ మొదటి స్థానంలో నిలిచింది.లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న సమంత ఈ ఇయర్ జానుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాను సినిమా ఫ్లాప్ అయినా సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి.

40 ఏళ్ల లోపు మోస్ట్ డిజైరబుల్  ఉమెన్ గా సమంత మరోసారి టాప్ పొజిషన్ లో నిలిచింది. ప్రస్తుతం సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్న అక్కినేని కోడలు పెళ్లి తర్వాత కూడా మిగతా హీరోయిన్స్ కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వెబ్ సీరీస్ లో విలన్ గా నటిస్తున్న సమంత త్వరలో తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ఎనౌన్స్ చేస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.