.jpeg)
ఇస్మార్ట్ శంకర్ తో సత్తా చాటిన రామ్ ప్రస్తుతం రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈమధ్య రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతుందని తెలుస్తుంది. ఆంధ్ర ఏరియా 12 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవగా.. సీడెడ్ 4 కోట్ల దాకా బిజినెస్ చేసిందట. ఇక నైజం బిజినెస్ మాత్రం ఇంకా జరగలేదట. ఇవే కాదు శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయంలో కూడా రామ్ రెడ్ మూవీ అదరగొడుతుంది. ఇస్మార్ట్ హిట్ జోష్ తో ఫామ్ లోకి వచ్చిన రామ్ రెడ్ మూవీతో ఎలాంటి సంచనాలు సృష్టిస్తాడో చూడాలి.
కిశోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు రామ్. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలతో కలిసి పనిచేసిన రామ్ కిషోర్ ఈ హ్యాట్రిక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.