ఎన్టీఆర్, రామ్ చరణ్ కరోనా అలర్ట్..!

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కరోనా మీద ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రంగంలోకి దిగారు. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తమ మాటల్లో చెప్పారు ఎన్టీఆర్, చరణ్. ఇద్దరు కలిసి కరోనా రాకుండా జాగ్రత్త పడాల్సిన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా చేతులు శుభ్రంగా ఉంచుకోండని.. దగ్గు, తుమ్ము వస్తే మోచేయి అడ్డుపెట్టుకోండని చెప్పారు. వాట్సాప్ మెసేజులు నమ్మాల్సిన పనిలేదని.. మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే మంచిదని చెప్పారు తారక్, చరణ్. 

తెలంగాణా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే తెలంగాణా సీఎం కేసీఆర్ 15 రోజుల పాటు అన్నిటికి సెలవు ప్రకటించారు. స్కూళ్ళు, కాలేజీలే  కాదు ఈవెంట్లు, ప్లే గ్రౌండ్స్, బార్లు ఇలా అన్నిటిని ఈ నెల 31 వరకు మూసేయాలని ఆర్డర్ వేశారు. ప్రజల్లో కరోనాపై అవగాహన కలిగించేందుకు వారి అభిమాన హీరోలతో కూడా జాగ్రత్తలు చెప్పిస్తున్నారు.