త్వరలో పవన్ సీఎం.. హౌ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఎలా ఉంటుంది. అదేంటి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆ ఛాన్స్ లేదుగా.. అయినా ఇంత సడెన్ గా పవన్ సీఎం ఎలా అవుతాడు అన్నది డౌట్ కదా జనసేన అధినేతగా కనీసం అతను ఎమ్మెల్యేగా గెలవలేదు సీఎం అవడం ఎలా అంటే పవన్ సీఎం అయ్యేది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. రియల్ లైఫ్ లో సీఎం అవడం సాధ్యాసాధ్యాల గురించి పక్కన పెడితే రీల్ లైఫ్ లో పవన్ ను సీఎం చేసే బాధ్యత మీద వేసుకున్నాడు డైరక్టర్ పూరి జగన్నాథ్. 

పవన్ కళ్యాణ్ తో పూరి బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేశాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ కాంబోలో సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈసారి పూరి పవన్ కోసం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తున్నాడట. అందులో పవన్ సీఎం అవుతాడని తెలుస్తుంది. పవన్ సీఎం అనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ మొదలైంది. ప్రస్తుతం పింక్ రీమేక్ గా వస్తున్నా వకీల్ సాబ్ లో నటిస్తున్న పవన్ క్రిష్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. క్రిష్ మూవీ తర్వాత పూరి సినిమా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.