కాజల్, అనుష్క ఇద్దరిలో చిరు జోడీ ఎవరు..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటించాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల త్రిష ఆ సినిమా నుండి తప్పుకుంది. ఇక ఆమె ప్లేస్ లో కాజల్ నటిస్తుందని అంటున్నారు. అయితే కాజల్ ఈ సినిమాలో నటించేందుకు భారీ రెమ్యునరేషన్ అడిగిందని తెలుస్తుంది. అందుకే కాజల్ బదులుగా అనుష్కని చిరుకి జోడీగా అడుగుతున్నారట. 

భాగమతి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో నిశ్శబ్దం సినిమా చేసిన అనుష్క సైరా నరసింహా రెడ్డి సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఇప్పుడు ఆచార్య కోసం అనుష్క హీరోయిన్ గా ఫంక్స్ చేస్తారని తెలుస్తుంది. చిరు స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన అనుష్క సైరాలో స్పెషల్ రోల్ లో నటించింది. ఇన్నాళ్లకు చిరుకి జతగా స్వీటీ ఫైనల్ చేస్తున్నారు. సీనియర్ హీరోలతో సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా ఉన్న ఇలాంటి టైం లో అనుష్క చిరుకి ఒకే చెప్పడం హాట్ న్యూస్ గా మారింది.