నితిన్ పెళ్లి మీద కరోనా ఎఫెక్ట్..!

యువ హీరో నితిన్ షాలినీలా మ్యారేజ్ ఏప్రిల్ 15న ఫిక్స్ చేశారు. దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేయగా ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. తెలంగాణలో ఇది మరింత ఉదృతం కాకుండా పరిస్థితి కంట్రోల్ లో ఉండేందుకు సీఎం కేసీఆర్ స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు, ఫంక్షన్స్ అన్ని బంద్ చేశారు. ఎంగేజ్మెంట్ జరుపుకున్న నితిన్ పెళ్ళికి కరోనా ఎఫెక్ట్ పడేలా ఉంది. ప్రస్తుతం విదేశాల ప్రయాణాలు కూడా రద్దు చేస్తున్న టైం లో పెళ్ళికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.    

నితిన్ పెళ్లిపై ఈ కన్ ఫ్యూజ్ గురించి వాళ్ళ ఇంటి నుండి కూడా రెస్పాన్స్ వచ్చింది. పెళ్లి డేట్ మార్చాలా.. వెన్యూ మార్చాలా అన్న ఆలోచనలో ఉన్నారట. లేదన్నది త్వరలో నిర్ణయిస్తామని నితిన్ సోదరి నిఖిత రెడ్డి అన్నారు. ఈమధ్యనే భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ డే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.