మాస్ రాజాతో మిల్కీ బ్యూటీ..!

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు రవితేజ. ఇక ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఒక సినిమా ఫిక్స్ చేశాడు రవితేజ. త్వరలో ఆ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ మూవీతో పాటుగా నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

నానితో నేను లోకల్ సినిమా చేసిన త్రినాథరావు మళ్ళీ నాని కోసమే ఓ కథ రాశాడట. అయితే ఆ కథ నాని విని తనకన్నా ఇది రవితేజకు బాగుంటుందని చెప్పి అతని దగ్గరకు పంపించాడట. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కథకు రవితేజ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ మూవీలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుందని తేలుస్తుంది. ఆల్రెడీ రవితేజతో బెంగాల్ టైగర్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో మరోసారి వాళ్లిద్దరూ జతకడుతున్నారు. మరి మాస్ రాజాతో మిల్కీ బ్యూటీ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.