
బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో సౌత్ కు వచ్చింది. తెలుగులో 3 సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్ బాస్ షో నాల్గవ సీజన్ కు సిద్ధం అవుతుంది. ఇక ఈసారి హోస్ట్ గా ఎవర్ని తీసుకుంటారా అన్న డిస్కషన్స్ లో ఇద్దరు పేర్లు వినపడుతున్నాయి. అందులో మొదటిది సూపర్ స్టార్ మహేష్, రెండోది కింగ్ నాగార్జున. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఎన్టీఆర్, సీజన్ 2 నాని, 3వ సీజన్ నాగార్జున హోస్ట్ గా చేశారు. ఇక నాల్గవ సీజన్ కు మహేష్ హోస్ట్ గా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే బుల్లితెర మీద యాడ్స్ రూపంలో కనిపిస్తున్న మహేష్ బిగ్ బాస్ హోస్ట్ గా చేసే ఛాన్సులు ఉన్నాయట. మహేష్ కు భారీ పారితోషికం ఇచ్చి హోస్ట్ గా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక మహేష్ కాదంటే మళ్ళీ నాగార్జుననే హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా నాగ్ తన సత్తా చాటారు. హోస్ట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడుతో సక్సెస్ అయినా నాగార్జున సీజన్ 3 ఎంతో ఉత్సాహంగా చేయగా సీజన్ 4 కొనసాగినా అదే క్రేజ్ ఉంటుంది.