ఆచార్య నుండి త్రిష అవుట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆచార్య నుండి హీరోయిన్ త్రిష తప్పుకున్నట్టు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లా చిరు సర్, కొరటాల శివ సినిమా నుండి తాను తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేసి మరి చెప్పింది త్రిష. సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా నటిస్తుందని తెలుస్తుంది.. అయితే తండ్రి కొడుకులు ఇద్దరు నటిస్తున్న ఈ సినిమాలో తను చరణ్ పక్కన కాకుండా చిరుతో జత కట్టడం ఇష్టం లేకనే ఆచార్య నుండి త్రిష బయటకు వచ్చిందని అంటున్నారు. ఎవరో ఏదో చెప్పడం వేరు స్వయంగా క్రియేటివ్ డిఫరెన్స్ అంటూ త్రిష ట్వీట్ చేయడంతో ఈ విషయంపై ఫోకస్ పెట్టారు. 

త్రిష ప్లేస్ లో అనుష్క నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. భరత్ అనే నేను సినిమా తరవాత ఏడాది గ్యాప్ తీసుకుని చిరు సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలో త్రిష ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారో చూడాలి.