అమృతం-2 ట్రైలర్ వచ్చేసింది

దశాబ్ద కాలం క్రితం బుల్లితెర మీద నవ్వుల జల్లులు కురిపించిన కామెడీ సీరియల్ అమృతం. జస్ట్ ఎల్లో మీడియా బ్యానర్ లో గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ సీరియల్ అప్పట్లో చాలా ఫెమస్. ప్రస్తుతం కామెడీ అంటే అడల్ట్ డైలాగ్స్ తో రోత పుట్టించేలా చేస్తుంటే.. అప్పుడు మాత్రం చాలా ఆరోగ్యకరమైన కామెడీతో అందరిని నవ్వించారు. అమృత విలాస్ ఇక్కడ నవ్వులు కొరత ఉండదు. అమృతం పాత్రలో శివాజీ రాజా, హర్షవర్ధన్, నరేష్ లు నటించగా.. అంజి పాత్రలో గుండు హనుమంతురావు నటించారు. అప్పాజి పాత్రలో శివ నారాయణ నటించారు.      

12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సీరియల్ కు సీక్వల్ చేస్తున్నారు. అమృతం ద్వితీయం సీరియల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సీక్వల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజయింది. ఉగాది సందర్భంగా ఈ నెల 25న అమృతం 2 టెలికాస్ట్ కానుంది. హర్షవర్ధన్ అమృత రావు పాత్రలో నటిస్తుండగా.. అంజి పాత్రలో సీనియర్ కమెడియన్ ఎల్బీ శ్రీరామ్ నటిస్తున్నారు. సర్వం పాత్రలో వాసు ఇంటూరి చేస్తున్నారు. మరి అమృతం ద్వితీయం మునుపటిలానే ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.