సాయి మాధవ్ డైరక్షన్ లో బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర డైరక్షన్ లో సినిమా వస్తుందని టాక్. గమ్యం సినిమా నుండి రైటర్ గా సత్తా చాటుతున్న సాయి మాధవ్ మెగా ఫోన్ పట్టాలని చూస్తున్నాడు. బాలయ్యకు సరిపోయే కథ సిద్ధం చేసుకుని బాలకృష్ణకు వినిపించాడట సాయి మాధవ్.

బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. డైలాగ్ రైటర్ గా తన టాలెంట్ చూపుతున్న సాయి మాధవ్ కు డైరక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నాడట. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బోయపాటి బాలయ్య కాంబోలో వస్తున్నా హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా తర్వాత సాయి మాధవ్ మూవీ ఉంటుందని తెలుస్తుంది.