కెజిఎఫ్-2 అఫీషియల్ రిలీజ్ డేట్

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కెజిఎఫ్.  భాషతో సంబంధం లేకుండా కెజిఎఫ్ మూవీ అన్ని చోట్ల సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా హిట్ అవడంతో చాప్టర్ 2ని మరింత భారీగా చేస్తున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ కూడా నటిస్తున్నారు. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఏవైటెడ్  మూవీ లిస్ట్ లో ఉన్న కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. 

సినిమాను అసలైతే 2020 సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనీ అనుకోగా ఈ ఇయర్ అక్టోబర్ 23న సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు. దసరా సందర్భంగా రెండు రోజుల ముందు కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ ఫిక్స్ చేశారు. దసరాకి తెలుగు స్ట్రైట్ సినిమాలు కూడా రిలీజ్ ప్లాం చేశారు. మరి కెజిఎఫ్ చాప్టర్ 2 ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. కెజిఎఫ్ సీక్వల్ కు తెలుగులో కూడా భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీక్వల్ కోసం తెలుగు ఆడియెన్స్ కూడా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.