సోలో సాయి తేజ్ కు శాటిలైట్ రైట్స్ అదిరింది..!

చిత్రలహరి ముందు వరకు ఫ్లాపుల్లో ఉన్న సాయి తేజ్ కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన ప్రతిరోజూ పండుగే సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో సాయి తేజ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు అయ్యింది. ఇక ప్రస్తుతం సాయి తేజ్ సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్ వాలెంటైన్స్ డే నాడు వచ్చిన స్పెషల్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. చూస్తుంటే ఈ సినిమాతో కూడా సాయి తేజ్ హిట్టు కొట్టేలా ఉన్నాడు. 

ఈ సినిమా బిజినెస్ బాగా జరుగుతుందని తెలుస్తుంది. థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఎంత అయ్యిందో తెలియదు కానీ శాటిలైట్ రైట్స్ మాత్రం భారీ రేటుకే అమ్ముడయ్యాయట. లీడింగ్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కొనేసిందట. 10 కోట్లకు సోలో బ్రతుకే సో బెటర్ శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తుంది.