అనుష్క @ 15 ఇయర్స్

స్వీటీ అనుష్క తన సిని కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనుష్క పనిచేసిన దర్శకులందరు అనుష్క 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.అనుష్కతో వారి వర్కింగ్ ఎక్స్ పీరియన్స్, అనుష్క సినిమా కోసం రిస్క్ చేసుకున్న విధానాన్ని గుర్తుచేసుకున్నారు. అనుష్క కూడా తనని ఇంతగా ఆదరించిన ఆడియెన్స్ కు తనతో పనిచేసిన డైరక్టర్స్, హీరోలు అందరికి థ్యాంక్స్ చెప్పింది. 

అనుష్క 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ తో పాటుగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న నిశ్శబ్దం సినిమా ప్రమోషన్ కూడా జరిగింది. తను నటించిన ఆ సినిమా గురించి కూడా మాట్లాడారు అనుష్క. ఈ సినిమా దర్శకుడు హేమంత్, నిర్మాత కోనా వెంకట్ తనకు చాలా సపోర్ట్ గా నిలిచారని.. సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను అలరిస్తుందని అన్నారు అనుష్క.