
నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా 'V'. సుదీర్ బాబు కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మార్చి 25 ఉగాది కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
రిలీజ్ ఇంకా రెండు వారాలు కూడా లేదు కాని పరిస్థితులు చూస్తుంటే నాని 'V' వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ బాగా ఉంది. వచ్చింది ఒకరిద్దరికే అయినా హడావిడి మాత్రం చాలా ఉంది. ఇప్పటికే ప్రభుత్వాలు కరోనా పై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో ప్రేక్షకులు థియేటర్ కు వచ్చే వీలుండదు. అందుకే 'V' సినిమా పోస్ట్ పోన్ ఆలోచనలో ఉన్నారట. నాని 'V' మాత్రమే కాదు ఉగాది సందర్భంగా రిలీజ్ అవ్వాల్సిన యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్.