
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా ఒక సినిమా వస్తుంది. వకీల్ సాబ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ ను విశేషంగా అలరిస్తుంది. వేణు శ్రీరాం డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ లో నివేదా థామస్ నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం వకీల్ సాబ్ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా కూడా నటిస్తుందని తెలుస్తుంది. చిట్టి నడుము సుందరి ఇలియానా తెలుగులో ఫేడవుట్ హీరోయిన్ అయ్యింది. అయినా సరే ఇక్కడ అవకాశాల కోసం చూస్తుంది. కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించిన ఇలియానా ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఇక అమ్మడికి అవకాశాలు ఇచ్చే వాళ్ళు కరువయ్యారు. లేటెస్ట్ గా వకీల్ సాబ్ మూవీలో ఇలియానా ఉంటుందని టాక్ వస్తుంది. ఆల్రెడీ పవన్ తో జల్సా సినిమాలో అమ్మడు నటించింది.