
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం డైరక్షన్ మాత్రమే కాదు కథలు కూడా అందిస్తాడు. రైటర్ గా కెరియర్ ప్రారంభించిన త్రివిక్రమ్ డైరక్టర్ గా మారాక బయట సినిమాలకు కథలు ఇవ్వడం లేదు. మొన్నామధ్య లై సినిమాకు త్రివిక్రమ్ ఆలోచనలో పుట్టిన కథే అని అన్నారు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఓ చిన్న సినిమా కథ అందిస్తున్నాడట త్రివిక్రమ్.
త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమాలకే కాదు త్రివిక్రమ్ రైటింగ్ లో వచ్చిన సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. అల వైకుంఠపురములో సినిమాతో సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా గ్యాప్ లో ఒక చిన్న సినిమాకు కథ ఇస్తున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ సినిమాలో నటించే కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది మాత్రం ఇంకా రివీల్ అవలేదు.