నివేదాకు మరో మెగా ఛాన్స్..!

మెగా హీరో సినిమాల్లో హీరోయిన్ కు ఛాన్స్ వచ్చింది అంటే ఆమె చాలా లక్కీ అన్నట్టే.. మెగా హీరో సినిమా హిట్ అయితే చాలు వరుసగా ఆ ఫ్యామిలీ హీరోలే ఛాన్సులు ఇస్తారు. లేటెస్ట్ గా కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్ కు వరుస మెగా ఛాన్సులు ఇస్తున్నారు. మెగా మేనళ్లుడు సాయి తేజ్ తో చిత్రలహరి సినిమాలో నటించిన నివేదా పేతురాజ్ ఆ తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో కూడా నటించింది. 

మెగా హీరోలకి కలిసి వచ్చిన ఈ లక్కీ గాళ్ కి మళ్ళీ మరో మెగా ఛాన్స్ పట్టేసింది తెలుస్తుంది. మెగా మేనళ్లుడు సాయి తేజ్ దేవా కట్టా డైరక్షన్ లో హీరోయిన్ గా నివేదాని సెలెక్ట్ చేశారట. సాయి తేజ్ తో ఆల్రెడీ చిత్రలహరి సినిమా చేసిన నివేదా ఆ సినిమాలో సైడ్ హీరోయిన్ గా నటించింది. ఈసారి మాత్రం మెయిన్ లీడ్ గా నటిస్తుందని టాక్. ప్రస్తుతం సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. సుబ్బు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.