
నాచురల్ స్టార్ నాని టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో ఓ సినిమా వస్తుందని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కథ మాత్రం రాహుల్ ది కాదని తెలుస్తుంది. ఒక ప్రొడక్షన్ ఆఫీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి చెప్పిన లైన్ నచ్చి నాని ఈ కథను మైత్రి మూవీ మేకర్స్ చేత కొనిచ్చాడట. అతను తన కథ కోసం 50 లక్షలు చార్జ్ చేశాడట.
నాని 50 లక్షలు ఇప్పించి మరి ఆ కథ కొన్నాడంటే ఆ కథలో ఎంత మ్యాటర్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. మాములుగా నాని కథల జడ్జ్ మెంట్ బాగుంటుంది. అలాంటిది యాభై లక్షలు ఇచ్చి మరి కథ కొన్నాడంటే కచ్చితంగా ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ తో నాని ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ సినిమా చేశాడు. ప్రస్తుతం నాని నటించిన వి సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఉగాది కానుకగా మార్చి 25న ఆ సినిమా వస్తుంది.