
మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో సినిమా తీసినా అందులో మెగా భజన ఉండాల్సిందే. రాం చరణ్, అల్లు అర్జున్ ఏమో కాని మిగతా హీరోలంతా ఎక్కడో ఒకచోట మెగాస్టార్, పవర్ స్టార్ లను వాడుకుంటారు. కొత్తగా ఎంట్రీ ఇస్తున్న వైష్ణన్ తేజ్ కూడా మెగా హీరోలని వాడేస్తున్నాడు. మెగా మేనళ్ళుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా చేస్తున్నాడు.
బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజైన కొత్త సాంగ్ ధక్ ధక్ లో వైష్ణవ్ తేజ్ వెనుక మెగాస్టార్, పవర్ స్టార్ ఇమేజ్ లు కనబడతాయి. వాళ్ళిద్దరిని చూడగానే మెగా ఫ్యాన్స్ ఉత్సాహపడతారు. ఏది ఏమైనా మెగా హీరోలు అందరు చిరు, పవన్ లను వాడందే పని కాదని చెప్పొచ్చు.