హనీమూన్ కు టైం లేదంటున్న యువ హీరో

యువ హీరో నిఖిల్ అర్జున్ సురవరం మూవీ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం చందు మొండేటి డైరక్షన్ లో కార్తికేయ 2 సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా మొదటి సినిమాకన్నా ఎక్కువ ఆసక్తితో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇటీవల పల్లవి వర్మతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు నిఖిల్.

నిఖిల్, పల్లవిల పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారట. అయితే పెళ్లి జరిగినా సరే హనీమూన్ కు వెళ్ళే టైం మాత్రం తనకు లేదంటున్నాడు నిఖిల్. కేవలం పెళ్లి కోసం వారం రోజులు టైం కేటాయించే అవకాశం ఉంది. హనీమూన్ కు అసలు టైం లేదు.. కార్తికేయ 2 షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది అంటున్నాడు నిఖిల్. కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో చందు మొండేటి తన టాలెంట్ చూపాడు. సవ్యసాచితో కెరియర్ లో వెనుకపడ్డ చందు ఈ సీక్వల్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు.