కరోనా వైరస్.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

చైనా నుండి వచ్చిన కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపణలు సృష్టిస్తుంది. తెలంగాణాలో కరోనా వైరస్ పై ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండతో ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు.

ఎక్కువ రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ ఉండవద్దని.. ఎవరైనా దగ్గినా.. తుమ్మినా వాళ్లకు మూడు అడుగుల దూరంలో ఉండాలని.. షేక్ హ్యాండ్ కన్నా పద్దతిగా నమస్కారం పెట్టడం మంచిదని. వ్యాధి లక్షణాలు కనిపిస్తే 104 కి ఫోన్ చేసి డాక్టర్ ను సంప్రదించాలని విజయ్ అన్నారు.