ప్రభాస్ జోడీగా కత్రినా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హేగ్దే నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈమధ్యనే ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ చేశారు.

వైజయంతి బ్యానర్ లో అశ్వని దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. టైం మిషన్ బ్యాక్ డ్రాప్ లో సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా వస్తుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. సాహో సినిమా కోసమే కత్రినాను అడిగితే డేట్స్ అడ్జెస్ట్ లేవని చెప్పిందట. అందుకే నాగ్ అశ్విన్ సినిమాకు కత్రినాను తీసుకోవాలని చూస్తున్నారు. మరి ప్రభాస్, కత్రినా జోడీ కుదిరితే ఆడియెన్స్ కు పండుగ అన్నట్టే.