RRR ఉగాదికి సర్ ప్రైజ్

ఎన్టీఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కొమరం భీమ్ పాత్రలో తారక్ కనిపించనున్నారు. 2021 జనవరి 8న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగన్ నటిస్తున్నారు. సినిమాలో హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

సినిమా టైటిల్ ఇది కథ ఇది అని ఎనౌన్స్ చేస్తూ రాజమౌళి ఇచ్చిన ప్రెస్ మీట్ తప్ప సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మధ్యలో సినిమా రిలీజ్ వాయిదా కూడా ట్వీట్ చేసి ఊరుకున్నారు. ఇక ఆర్.ఆర్ ఆర్ ఉగాదికి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ నుండి ఉగాదికి ఒక క్రేజీ అప్డేట్ వస్తుందట. మరి అది ఫస్ట్ లుక్ ఇస్తారా లేక మరేదైనా రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.