ఫ్యామిలీతో ఎన్టీఆర్ హోలీ సెలబ్రేషన్స్..!

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా మన స్టార్స్ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మహేష్ అయితే సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ తీసుకుని మరి ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేస్తాడు. ఇక మిగతా హీరోలు కూడా అలాంటి ప్లాన్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి అంతాఇంతా కాదు. సోమవారం హోలీ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ తో పండుగ జరుపుకున్నారు.

ఎన్టీఆర్ కూడా తన కుటుంబంతో హోలీ జరుపుకున్న పిక్స్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతితో పాటుగా వారి ఇద్దరు చిన్నారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. తారక్ షేర్ చేసిన ఈ పిక్స్ నందమూరి ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సిని ప్రియులను అలరిస్తున్నాయి.