
మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ తేజ్ మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కు రెడీ అయ్యింది. మెగా మేనళ్ళుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఉప్పెన సినిమాకు సుకుమార్ సపోర్ట్ కూడా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
ఈ సినిమా నుండి మొదటిసాంగ్ సూపర్ హిట్ అవగా లేటెస్ట్ గా సినిమా నుండి ధక్ ధక్ ధక్ అంటూ మరో సాంగ్ రిలీజ్ చేశారు. దేవి మార్క్ మ్యూజిక్ తో వచ్చిన ఈ సాంగ్ లో వైష్ణవ తేజ్, కృతి శెట్టి ల ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ చాలా రీ ఫ్రెషింగ్ గా అనిపిస్తుండగా సినిమా కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతి అందించేలా ఉంది. మరి మెగా ఫ్యామిలీ నుండి వస్తున్నా ఈ హీరో ఉప్పెనతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.