తమన్నా స్వయంవరానికి ఆ ముగ్గురు రావాలట..!

మిల్కీ బ్యూటీ తమన్నాకి పెళ్లి వైపు మనసు వెళ్ళిందా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. రెండేళ్ళ క్రితం వరకు కెరియర్ అటు ఇటుగా ఉన్న తమన్నా మళ్ళీ ఊపందుకుంది. ఎఫ్-2 సినిమా హిట్ అవడం ఆమెకు మళ్ళీ మంచి మైలేజ్ తెచ్చింది. ఇక లేటెస్ట్ గా చేతినిండా సినిమాలతో అమ్మడు బిజీగా ఉంది. ఇలాంటి టైం లో పెళ్లి గురించి అడిగితే నాకా అప్పుడే పెళ్ళా అని రొటీన్ డైలాగ్ కాకుండా తను పెళ్లి చేసుకోవాలంటే స్వయంవరం జరగాలని.. ఆ స్వయంవరానికి హృతిక్ రోషన్, విక్కి కౌషల్, ప్రభాస్ ఈ ముగ్గురు స్వయంవరంలో పాల్గొనాలని చెబుతుంది.

మిల్కీ బ్యూటీ తమన్నా అలా కోరుకోవడంలో తప్పేమీ లేదు.. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నా.. 15 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది తమన్నా.. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న తమన్నా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది. స్వయంవరానికి ఆ ముగ్గురే అంటే మిగతా హీరోల ఫ్యాన్స్ హార్ట్ అవుతారు తమన్నా అది గమనించలేదా ఏంటని అమ్మడిపై కామెంట్స్ చేస్తున్నారు.