
మహానటి తర్వాత తెలుగులో కీర్తి సురేష్ వరుస వెంట సినిమాలు చేస్తుందని అనుకున్నారు. కాని తెలుగులో కన్నా తమిళంలో ఆమె వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. మహానటితో తన నట విశ్వరూపం చూపించిన కీర్తి సురేష్ తెలుగులో మిస్ ఇండియా సినిమా చేసింది. నరేంద్ర నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కోనేరు మహేష్ నిర్మించారు. సినిమా పూర్తయినా ఇన్నాళ్ళు రిలీజ్ సంక్షోభంలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
ఏప్రిల్ 17న మిస్ ఇండియా సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. మహానటి తర్వాత కీర్తి సురేష్ నటించిన సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొన్నామధ్య సినిమా నుండి వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ నాని, నితిన్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.