చిరుకి ఒక్కడికే ఆ ఛాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా ఆచార్య సెట్స్ మీద ఉంది. కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కూడా నటిస్తాడన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుందని తెలుస్తుండగా స్పెషల్ సాంగ్ లో రెజినా కనిపించనుందట.

స్టార్ హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ ఉన్నా సినిమాల ఎంపిక లోపం వల్ల కెరియర్ లో వెనుకపడ్డ రెజినా పూర్తిగా ఫాం కోల్పోయింది. అ!, ఎవరు లాంటి సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్న రెజినా మెగాస్టార్ సినిమా ఆఫర్ రాగానే ఎగిరి గంతేసింది. అయితే సినిమాలో అమ్మడు చేసేది ఐటం సాంగ్ అనగానే కేవలం చిరు కోసమే ఈ సాంగ్ కు ఓకే చెప్పానని అంటుంది రెజినా.  చేసేది స్పెషల్ సాంగ్ అయినా దాన్ని ఐటం నంబర్ అనొద్దని చెబుతుంది అమ్మడు. మరి ఈ సాంగ్ తో అయినా అమ్మడు ఫేట్ మారుతుందేమో చూడాలి.