
సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అల్లరి నరేష్ కు జోడీగా నటిస్తుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దశాబ్ద కాలం నుండి సక్సెస్ ఫుల్ కెరియర్ సాగిస్తున్న కాజల్ ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈమధ్య కెరియర్ కొద్దిగా వెనక్కి తగ్గినట్టు అనిపించినా స్టార్స్ తోనే కాదు యువ హీరోలతో కూడా జోడీ కడుతూ సత్తా చాటుతుంది.
ఇక లేటెస్ట్ గా అల్లరి నరేష్ సినిమాలో కాజల్ హీరోయిన్ గా చేస్తుందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా కెరియర్ లో వెనుకపడ్డ అల్లరి నరేష్ మహర్షి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమా తర్వాత అతనికి మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం బంగారు బుల్లోడు సినిమా చేస్తున్న అల్లరి నరేష్ కాజల్ తో రొమాన్స్ కు రెడీ అవుతున్నాడు.
సురేష్ బాబు నిర్మాతగా కొరియన్ మూవీ డ్యాన్సింగ్ క్వీన్ మూవీ రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో క్వీన్ గా కాజల్ ను సెలెక్ట్ చేయగా.. అందులో హీరోగా అల్లరి నరేష్ నటిస్తాడని తెలుస్తుంది. మరి నరేష్ తో కాజల్ పెయిర్ ఎలా ఉంటుందో చూడాలి.