RRR టైటిల్ ఇదేనా..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల పైగా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ నటిస్తున్నారు. స్పెషల్ రోల్ లో హాలీవుడ్ బుల్లితెర నటీమణి ఒలివియా మోరిస్ ను ఎంపిక చేశాడు రాజమౌళి.

ఆర్.ఆర్.ఆర్ టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి దాని అబ్రివేషన్ కోసం ఎవరికి వారు తమ క్రియేటివిటీ మొదలు పెట్టారు. ఫైనల్ గా ఇంతకుముందు అనుకున్న రామ రావణ రాజ్యం అనే టైటిల్ కే చిత్రయూనిట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. సినిమాలో తారక్, చరణ్ ఇద్దరు రియల్ లైఫ్ హీరోలైన కొమరం భీమ, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. మరి బయటకు వచ్చిన ఈ టైటిల్ కన్ ఫామా కాదా అన్నది చూడాలి. 2021 జనవరి 8న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.