నాచురల్ స్టార్ తో టాలెంటెడ్ డైరక్టర్..!

 నాచురల్ స్టార్ నాని ఈ నెల చివరన వి సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో నాని విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. మరోపక్క శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీశ్ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. 

ఇక ఈ సినిమాతో పాటుగా నాని టాలెంటెడ్ డైరక్టర్ వివేక్ ఆత్రేయతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తారని సమాచారం. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో సక్సెస్ అందుకున్న వివేక్ ఆత్రేయ తన మూడవ సినిమా నాని హీరోగా చేస్తున్నాడని తెలుస్తుంది. రెండు సినిమాలతో ప్రతిభ చాటుకున్న వివేక్ ఆత్రేయ నానితో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.