
యాంకర్ గా సూపర్ ఫామ్ లో ఉన్న ప్రదీప్ మాచిరాజు హీరోగా చేస్తున్న తొలి ప్రయత్నం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? మున్నా డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. మార్చి 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను రెండు పెద్ద ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ సినిమాను GA2, UV క్రియేషన్స్ రెండు సంస్థలు భారీగా రిలీజ్ చేస్తున్నాయి.
ప్రదీప్ సినిమాను ఆ బ్యానర్ లు తీసుకోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. స్మాల్ స్క్రీన్ పై తన యాంకరింగ్ తో సత్తా చాటిన ప్రదీప్ మాచిరాజు హీరోగా కూడా తన ప్రతిభ చూపించాలని చూస్తున్నాడు. ఆల్రెడీ సాంగ్స్ సూపర్ హిట్ అవడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ప్రదీప్ హీరోగా చేసిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.