
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హారిక హాసిని బ్యానర్ తో పాటుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాన్ రామ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఈ మూవీకి అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో పూజా హేగ్దే, రష్మిక నటిస్తారని వార్తలు రాగా ఫైనల్ గా ఈ సినిమాలో సమంత ఒక హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఇక సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ నుండి అలియా భట్, జాన్వి కపూర్ ఇద్దరిలో ఒకరిన్ని సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న అలియా భట్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయితే టాలీవుడ్ లో అలియా హంగామా షురూ అయినట్టే లెక్క.