మహేష్ చరిత్ర సృష్టించాడు..!

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సూపర్ ఫాం లో ఉన్నాడని చెప్పొచ్చు. ఈ ఇయర్ మొదట్లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ అందుకున్న మహేష్ తన తర్వాత సినిమాకు రెడీ అవుతున్నాడు. అసలైతే వంశీ పైదిపల్లితో మహేష్ సినిమా చేయాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయ్యి పరశురాం డైరక్షన్ లో మహేష్ సినిమాకు రంగం సిద్ధం అవుతుందని తెలుస్తుంది.

సినిమాలతో రికార్డులు సృష్టించే మహేష్ ఇప్పుడు కొత్త మరో హిస్టరీ క్రియేట్ చేశాడు. ట్విట్టర్ లో మహేష్ 90 లక్షల ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశాడు. సౌత్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా తన సత్తా చాటాడు మహేష్. 2010లో ట్విట్టర్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ 10 ఏళ్లలో 9 మిలియన్ ఫాలోవర్స్ ను ఏర్పరచుకున్నాడు. ఇదివరకు ధనుష్ ట్విట్టర్ ఫాలోవర్స్ లో ముందు ఉండగా అతన్ని క్రాస్ చేసి మహేష్ నంబర్ 1 గా ఉన్నాడు.