‘మరక్కార్’ ట్రైలర్.. మళయాళ బాహుబలి

బాహుబలి సినిమా స్పూర్తితో మిగతా భాషల వారు కూడా భారీ స్థాయి సినిమాలు చేస్తున్నారు. ఎంత బడ్జెట్ పెట్టినా సరే కరెక్ట్ కంటెంట్ తో వస్తే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత కెజిఎఫ్ అలా వచ్చిందే.. ఆ సినిమా కూడా సూపర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మళయాళ పరిశ్రమ నుండి మరో బాహుబలి రేంజ్ సినిమా వస్తుంది. అదే మరక్కార్.

ప్రియదర్శన్ డైరక్షన లో వస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటుగా కీర్తి సురేష్, అర్జున్, ప్రభు, సునీల్ శెట్టి, సుహాసిని వంటి స్టార్స్ నటిస్తున్నారు. అంతేకాదు సినిమాలో మోహన్ లాల్ నట వారసుడు ప్రణవ్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను హిందీలో అక్షయ్ కుమార్, తమిళంలో సూర్య రిలీజ్ చేయగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు.