కాజల్ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్..!

తేజ డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న సినిమా అలిమేలుమంగ వెంకటరమణ. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో మొదట కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నా అమ్మడు రెమ్యునరేషన్ భారీగా అడగడంతో ఆమెను కాదని కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. గోపీచంద్ పక్కన నటించాలి అంటే 2 కోట్లు కావాల్సిందే అంటూ కాజల్ డిమాండ్ చేసిందట. హీరోయిన్ విషయంలో చాలా క్లియర్ గా ఉండే తేజ, కాజల్ అడిగిన పారితోషికం ఇవ్వడం కుదరదని చెప్పాడట. 

కాజల్ ప్లేస్ లో కీర్తి ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యింది. మహానటి తర్వాత పెద్దగా తెలుగులో సినిమాలు చేయని కీర్తి సురేష్ ప్రస్తుతం మిస్ ఇండియాను పూర్తి చేసే పనిలో ఉంది. ఈలోగా గోపీచంద్ ఆఫర్ వచ్చింది. మరో రెండు స్టార్ సినిమా అవకాశాలు వచ్చినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ కన్నా కోలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన కీర్తి సురేష్ ఇక మీదట తెలుగులో కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. తేజ డైరక్షన్ లో మహానటి అనగానే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.