
స్వీటీ
అనుష్క లీడ్ రోల్ లో హేమంత్ మధుకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా నిశ్శబ్దం.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్ కార్పో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో
కోలీవుడ్ హీరో మాధవన్ కూడా నటించారు. శాలిని పాండే, అంజలి వంటి స్టార్స్ కూడా ఈ
మూవీలో నటించారు. ఏప్రిల్ 2న
రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. నిశ్శబ్దం టీజర్
ఇంట్రెస్టింగ్ గా అనిపించినా ఆ సస్పెన్స్ ను కొనసాగిస్తూ ట్రైలర్ కూడా సినిమాపై
ఆసక్తిని పెంచింది.
సినిమాలో అనుష్క డెఫ్ అండ్ డమ్ పాత్రలో నటించింది. కేవలం తన ఎక్స్ ప్రెషన్స్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది అనుష్క. ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం ఫారిన్ లోనే షూట్ చేసినట్టు తెలుస్తుంది. జనవరి చివర్లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా రిలీజ్ ఇన్నాళ్ళకు కుదిరింది. మరి నిశ్శబ్దం అనుకున్న విధంగా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.